మాతో చర్చించడానికి మాతో చర్చించడానికి

ఇళ్లలోనే ఉండండి. భద్రంగా ఉండండి.

క్యాన్సర్ నిర్ధారణ, పరీక్షలు మరియు చికిత్సలపై సలహాల కోసం ఉత్తమ క్యాన్సర్ నిపుణులు మరియు ఆంకాలజిస్టులతో సంప్రదింపులు జరపండి.

చికిత్సను మించి

క్యాన్సర్ కేవలం శారీరకంగానే కాకుండా, మానసికంగానూ రోగిని మరియు కుటుంబ సభ్యులను వేదనకు గురిచేస్తుంది. క్యాన్సర్ క్లినిక్స్‌లో, మేము కేవలం చికిత్సను అందించడమే కాకుండా, మీ మెరుగైన భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న ప్రయాణంలో పూర్తి తోడ్పాటును అందిస్తాం.

క్యాన్సర్ రహిత ప్రపంచం కోసం మేము చేపట్టిన మిషన్‌లో మాకు సహాయపడటానికి ఆంకాలజీ రంగ నిపుణులు కృషి చేస్తున్నారు.

సురక్షితమైన మరియు సౌఖర్యాలతో కూడిన వాతావరణంలో ప్రతి బాధితుడు మరియు వారి కుటుంబం పట్ల ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా శ్రద్ధ కనబరుస్తాం. క్యాన్సర్ సంరక్షణ మరియు చికిత్సకు క్యాన్సర్ క్లినిక్స్‌ అత్యుత్తమం అని చెప్పడానికి మేమెంతో గర్విస్తున్నాం.

మా క్లినిక్స్‌ను సందర్శించడానికి లేదా మా సేవలను పొందడానికి, అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి ఈ ఫారమ్‌ని పూర్తిచేయండి. మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు.

మా సేవలు

మా సేవలు

క్యాన్సర్‌తో పోరాడటానికి మీరు చేస్తున్న ప్రయాణంలో మేము మీకు సహచరులం. మా వృత్తిపరమైన సేవల ద్వారా మీరు పొందగలిగే అత్యుత్తమ చికిత్సను అందించడంపై దృష్టి సారించాం. చికిత్స ద్వారానే కాకుండా అంతకు మించి మీ జీవన గమనంలో మీకు సహాయపడేలా సహకారాన్ని, మద్దతును మా సమగ్ర సంరక్షణ బృందం మీకు అందిస్తుంది.

Mountains

మెడికల్ ఆంకాలజీ

కీమోథెరపీ, ఇమ్యునో థెరపీ, టార్గెటెడ్ థెరపీ విధానాలలో మా మెడికల్ ఆంకాలజిస్టులు చికిత్స అందిస్తారు.

మెడికల్ ఆంకాలజీ

ప్రక్రియలకు అత్యంత అనుకూలంగా మరియు ఇబ్బంది లేని పద్ధతిలో ప్రత్యేకంగా మా క్లీనిక్ రూపొందించబడింది. అత్యాధునిక పరికరాలు, ఉత్తమ ప్రోటోకాల్‌తో, మేము రోగులకు వారి సంరక్షకులకు చవకైన ధరలో ఉత్తమ చికిత్సను అందిస్తాం.

ఇంకా చదవండి
Mountains

సర్జికల్ ఆంకాలజీ

కాన్సర్ వ్యాప్తి చెందకుండా, మళ్లీ రాకుండా మా సర్జికల్ ఆంకాలజిస్టుల ప్యానెల్ ఉత్తమ పద్ధతిలో చికిత్స అందిస్తారు.

సర్జికల్ ఆంకాలజీ

సర్జికల్ ఆంకాలజీలో శరీరంలోని ప్రభావిత భాగాన్ని తొలగించకుండా లేదా గణనీయమైన నష్టాన్ని కలిగించకుండా కణితిని మాత్రమే తొలగించే శస్త్ర చికిత్సలు ఉన్నాయి. క్యాన్సర్ బాధితుడు త్వరగా కోలుకోవడానికి.. అతనికి అవసరమైన సహాయం, సంరక్షణను అందించడానికి క్యాన్సర్ క్లినిక్స్‌లో మా ఇంటిగ్రేటివ్ కేర్ ఫిజికల్ థెరపిస్ట్‌లు, న్యూట్రిషనిస్ట్‌లు మరియు కౌన్సెలర్లు అన్ని విధాల అందుబాటులో ఉంటారు.

ఇంకా చదవండి
Mountains

రేడియేషన్ ఆంకాలజీ

స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీని ఉపయోగించి చికిత్స అందించే రేడియేషన్ ఆంకాలజీలోని ఉత్తమమైన వైద్యులతో క్యాన్సర్ బాధితులకు ట్రీట్మెంట్ ఇస్తాం.

రేడియేషన్ ఆంకాలజీ

రేడియేషన్ థెరపీని మా ‘ఎండ్-టు-ఎండ్’ ట్రీట్మెంట్ ప్లాన్‌లలో చేర్చాము. తగిన మోతాదు మరియు చికిత్స వ్యవధితో సహా రేడియేషన్ థెరపీ ప్లాన్‌ను రూపొందించడానికి మా మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డు అనువైన ప్రణాళిక రూపొందిస్తుంది. క్యాన్సర్ బాధితుడు మరియు వారి కోసం రూపొందించిన ప్రత్యేక చికిత్సా ప్రణాళిక ఆధారంగా మేము దీనిని నిర్ణయిస్తాము. కోచింగ్, కౌన్సెలింగ్ మరియు సరైన పోషకాహారంతో రేడియేషన్ థెరపీ యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి క్యాన్సర్ బాధితులకు సహాయపడేలా మా ఇంటిగ్రేటివ్ కేర్‌పై దృష్టి సారించాం.

ఇంకా చదవండి
Mountains

స్క్రీనింగ్

తరుచూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తూ.. ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి ఉత్తమ ఫలితాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం.

స్క్రీనింగ్

ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం, అలాగే గత ఐదేళ్ల కాలంలో క్యాన్సర్ బారి నుంచి బయటపడిన వారి శాతం ఎక్కువగా ఉండి, చికిత్స ఖర్చు తక్కువగా ఉండటాన్ని క్యాన్సర్‌పై పోరాటంలో నిజమైన ప్రామాణికంగా ‘క్యాన్సర్ క్లినిక్స్’ విశ్వసిస్తోంది. మా BEAT(Best outcomes through Early and Accelerated Treatment)ప్రోగ్రామ్ దానిని నిర్ధారించడంపై దృష్టి పెట్టింది. నివారణ, స్క్రీనింగ్ మరియు సర్వైవల్ స్ట్రాటెజీస్ ద్వారా ఆధునాతన దేశాల సరసన భారతదేశం నిలిచేలా చేయడమే బీట్ ప్రోగ్రామ్ లక్ష్యం. రండి మాతో కలిసి పోరాడండి. #BEATcancerwithCancerClinics

ఇంకా చదవండి

ENQUIRY NOW

సమగ్ర సంరక్షణ

రోగి మరియు కుటుంబాన్ని సరైన మార్గంలో ఆదుకోవడానికి మేము కోచింగ్, జెనెటిక్ కౌన్సెలింగ్, పోషక సంప్రదింపులు మరియు సైకో-ఆంకాలజీని అందిస్తున్నాము.

కోచింగ్

రోగ నిర్ధారణ నుంచి మొదలుకొని చికిత్స ముగిసే వరకు చికిత్స కాలమంతా అవసరమైన -మా క్యాన్సర్ కోచ్‌లు క్యాన్సర్ బాధితులు మరియు కుటుంబానికి తోడుగా ఉంటారు. వారికి నిరంతరం మార్గనిర్దేశనం చేయడానికి అవసరమైన వైద్య, శిక్షణను కలిగి ఉన్నారు.

ఫార్మసీ

చికిత్స ప్రణాళికలో మందులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మాకు తెలుసు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మా క్లీనిక్స్‌లోని ఆంకాలజీ ఫార్మసీలో ఎల్లప్పుడూ మీకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంటాయి.

జెనెటిక్ కౌన్సెలింగ్

మీకు మరియు మీ మొత్తం కుటుంబానికి జన్యుపరమైన కౌన్సెలింగ్‌ అందిస్తూ.. ప్రమాదాలు, పర్యవసానాలు, దీర్ఘకాలిక అనారోగ్యానికి సంబంధించి అవసరమైన సమాచారాన్ని, సూచనలను సలహాలను అందిస్తాం.

సైకో - ఆంకాలజీ

చికిత్స సమయంలో అనిశ్చితి, ఆందోళన, నిస్సహాయత, గందరగోళాన్ని తొలగించడానికి మా సైకో-ఆంకాలజిస్టులు మీకు అందుబాటులో ఉంటూ సరైన సమచారాన్ని ఇస్తారు.

పోషణ

క్యాన్సర్ రోగుల అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మా న్యూట్రిషనిస్టులు చికిత్స యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి మీకు సరైన పోషకాహారం అందేలా చూస్తారు.

ENQUIRY NOW

Thumb

 

క్యాన్సర్ చికిత్సా కాలాన్ని డిజిటలైజ్ చేయడంలో క్యాన్సర్ క్లినిక్స్ ముందంజలో ఉంది. టైమ్ టేబుల్‌ను క్రమంగా తెలుపుతూ.. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా చేస్తుంది.

 

డాక్టర్ డి. రఘునాధరావు MBBS, MD, DM FRCP (లండన్) నేతృత్వంలో డిజిటల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించుకుని ముందడగువేసింది. వారి అపారమైన అనుభవం, విద్యా పరిశోధన మరియు భవిష్యత్ కార్యాచరణ విధానం క్యాన్సర్‌పై పోరాడటాన్ని, సంరక్షణను పొందడానికి సరికొత్త మార్గాలలో వెళ్లేలా చేస్తోంది.

 

క్యాన్సర్ బాధితుడి నుంచి అత్యుత్తమ ఫలితాలు పొందడానికి.. సంరక్షణ, ప్రోటోకాల్‌, సులభమైన సంప్రదింపులకు ఇలా అన్నిటిని డిజిటలైజ్ చేయడానికి డిజిటల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ సిద్ధంగా ఉంది.

క్యాన్సర్ బాధితుల అనుభవాలు

మా దగ్గర వైద్య సేవలు అందుకున్న వారి మాటలే మాకు అతిపెద్ద ప్రశంసా పత్రాలు. వారి ప్రశంసాపూర్వకమైన మాటలు మమ్మల్ని ముందడుగు వేసేలా చేస్తాయి. బాధితుల ఆరోగ్య సంరక్షణపై అలాగే అవసరమైన చికిత్సకు సంబంధించిన ఎంపికలు చేసుకొనేలా వారికి సంపూర్ణమైన అధికారముందని భావిస్తున్నాము.

మా వైద్య బృందం

గుర్తింపు పొందిన, అనుభవం మరియు అర్హత కలిగిన ఆంకాలజిస్టులు, నిపుణుల బృందం మీకు ప్రత్యేక చికిత్స అందించడంతో పాటు కేర్ తీసుకోవడానికి కట్టుబడి ఉంది.


BOOK A CONSULTATION

పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్


క్యాన్సర్ బాధితులకు వైద్యం అనేది వారి మానసిక, శారీరక శ్రేయస్సుపై మాత్రమే కాకుండా వారి ఆర్థిక స్థిరత్వంపై కూడా భారీగా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మేము వారిపై కలిగే ఒత్తిడిని తగ్గించడానికి పూనుకున్నాం. దీనిలో భాగంగా ‘పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నాం. మా ‘పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్’లో భాగమవ్వడం ద్వారా వారు ఎంచుకున్న మందులపై 50% వరకు తగ్గింపు ఇవ్వడానికి నిర్ణయించాం.


మా సేవల గురించిన మరింత సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి.


క్యాన్సర్ క్లీనిక్స్

జూబ్లిహిల్స్

స్టార్ హాస్పిటల్స్

బంజారా హిల్స్

ఆస్తెర్ ప్రైమ్ హాస్పిటల్స్

అమీర్ పేట్

అంకుర

కేపీహెచ్‌బీ

ఎక్సెల్ హాస్పిటల్

అల్వాల్

విజయ హెల్త్ కేర్

సికింద్రాబాద్

జెర్మంటెన్

అత్తాపూర్

మెడిసిస్ హాస్పిటల్స్

ఎల్ బి నగర్

మెడ్ నైన్ హెల్త్ కేర్

బంజారా హిల్స్